Header Banner

ఓటీటీలోకి ప్రియమణి నటించిన లీగల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. తెలుగు సహా 7 భాషల్లో స్ట్రీమింగ్!

  Wed Jun 04, 2025 13:53        Entertainment

ఒక వైపున సినిమాలలో ముఖ్యమైన పాత్రలను చేస్తూనే, మరో వైపున వెబ్ సిరీస్ లతో ప్రియమణి బిజీగా ఉంది. తెలుగులో ఆమె చేసిన 'భామ కలాపం' ఓటీటీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. 'ది ఫ్యామిలీ మేన్' సిరీస్ కూడా ఆమెకి మరింత క్రేజ్ తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆమె ప్రధానమైన పాత్రగా ఒక వెబ్ సిరీస్ నిర్మితమైంది.. ఆ సిరీస్ పేరే 'గుడ్ వైఫ్'. ఇది ఒక అమెరికన్ షో ఆధారంగా రూపొందిన సిరీస్. తమిళంలో రూపొందించిన ఈ సిరీస్ ను, తెలుగు.. మలయాళ.. కన్నడ.. హిందీ.. బెంగాలీ.. మరాఠీ భాషలలో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ సిరీస్ నుంచి వదిలిన ఫస్టు పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇతర ముఖ్యమైన పాత్రలలో రేవతి.. సంపత్ రాజ్.. ఆరి అర్జునన్ కనిపించనున్నారు. కథ విషయానికి వస్తే.. ప్రియమణి ఈ సిరీస్ లో లాయర్ పాత్రలో కనిపించనుంది. మాజీ లాయర్ అయిన ఆమె, భర్త.. ఇద్దరు పిల్లలతో కలిసి హాయిగా జీవిస్తూ ఉంటుంది. అయితే ఊహించని విధంగా ఆమె భర్త సెక్స్ స్కాండల్ లో చిక్కుకుంటాడు. సమాజం అంతా ఆ కుటుంబం వైపు చూస్తూ ఉంటుంది. తన భర్త నిర్దోషి అని నిరూపించడం కోసం ఆమె లాయర్ గా మళ్లీ కోర్టు మెట్లు ఎక్కుతుంది. ఆ తరువాత చోటుచేసుకునే మలుపులే మిగతా కథ.

 

ఇది కూడా చదవండి: ఏపీలో మరో నేషనల్ హైవే నాలుగు లైన్లుగా..! ఈ రూట్‌లో రూ.5వేల కోట్లతో, శ్రీశైలం త్వరగా వెళ్లొచ్చు..!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

యువగళం పుస్తకం.. లోకేష్‌కు పవన్ అభినందనలు! ఆనాటి అనుభవాలను కళ్ల‌కి కట్టినట్లుగా..

 

యూఏఈ గోల్డెన్ వీసా.. ట్రంప్ గోల్డెన్ వీసా...! రెండింట్లో ఏది బెటర్?

 

ఎర్రగడ్డ మానసిక చికిత్స కేంద్రంలో ఫుడ్ పాయిజన్! ఒకరి మృతి... అసలు కారణం ఇదే!

 

ఏపీలో రైలు ప్రయాణికులకు గమనిక..! ఈ 7 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అదనపు బోగీలు!

 

ఏపీలో అక్కడ కొత్తగా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్..! ఏకంగా 5వేల ఎకరాల్లో, ఆ ప్రాంతానికి మహర్దశ!

 

ఏపీలో ఆ ప్రభుత్వ ఉద్యోగులందరికి ప్రమోషన్లు..! మొత్తానికి కల నెరవేరింది, బదిలీలు కూడా..!

 

వర్చువల్ సిస్టమ్‌ వినియోగదారులకు షాక్! మైక్రోసాఫ్ట్ తాజా అప్‌డేట్ లో లోపం!

 ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Priyamani #GoodWife #GoodWifewebseries #BhaamaKalapam #TheFamilyMan #Legalthriller #OTT #release #DisneyPlusHotstar #RevathiSampathRaj